18-12-2025 07:55:12 PM
- కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్ (విజయక్రాంతి): అమృత్ 2 పథకంలో చేపట్టబోయే పెండింగ్ పనులను సోమవారం లోగా ప్రారంభం చేసి.. త్వరగా పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని కొత్తపల్లి ప్రాంతంలో పర్యటించారు. నగరపాలక సంస్థ మంచినీటి సరఫరాలో భాగంగా కొత్తపల్లి ప్రాంతంలో చేపట్టబోయే ఫిల్టర్ బెడ్, రిజర్వాయర్, పైపు లైన్ పనుల ప్రదేశాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... సీడీఎంఏ అధికారి ఆదేశాల ప్రకారం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలోని అమృత్ 2 అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. పనులు ప్రారంభం చేయని చోట త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతంలో 3 ఎంఎల్ డి ఫిట్లర్ బెడ్ తో పాటు 10 లక్షల లీటర్ల మంచి నీటి రిజర్వాయర్( (ట్యాంక్) నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్&బి రహదారి వెంబడి 3 కి. మీ మేర మంచి నీటి పైపు లైన్ పనులను త్వగరా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ దేవేంధర్, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.