18-12-2025 07:45:20 PM
చొప్పదండి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ సర్పంచ్ గుమ్మడి మల్లేశం గురువారం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కొండూరి రవీందర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గుండి గ్రామ సర్పంచ్ ఎన్నికైన గుమ్మడి మల్లేశంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంకులో 41 సంవత్సరాలు అటెండర్ స్థాయి నుంచి మేనేజర్ స్థాయికి ఎదిగి నిరంతర సేవలలు అందించి నిజాయితీ అంకితభావంతో బ్యాంకు అభివృద్ధికి నిజాయితీ విధేయతతో అందరి మన్ననలు గైకొని బ్యాంకు మేనేజర్ గా విరమణ పొందారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో కూడా నిరంతర సేవలు అందించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కొనియాడారు. ఆయనతో పాటు బ్యాంకు సీఈవో సత్యనారాయణ, జిఎం బి శ్రీధర్ తదితరులు ఉన్నారు.