23-04-2025 10:21:11 PM
హాస్పిటల్ కు తరలింపు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సూరారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకట్రాం నగర్ నార్త్ సిటీ హై స్కూల్ వెనుక వీధిలో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుండి బుధవారం వృద్ధుడు జారి కింద పడిపోయాడు. స్థానికులు సూరారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.