23-12-2025 02:37:43 AM
స్ట్రీట్ రౌడీలా రేవంత్‌రెడ్డి మాటలు
బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక ఆరాచకత్వం జరిగిందనడం హాస్యాస్పదం
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రీట్ రౌడీలా మాట్లాడి ఆయన సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు గడ్డిపరకల్లా త్యాగం చేసిం ది బీఆర్‌ఎస్ నాయకులని.. చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చా రని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పారని అన్నా రు.
బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక ఆరాచకత్వం జరిగిందని రేవంత్ చెప్పడం హాస్యా స్పదంగా ఉందన్నారు. సాక్షాత్తు ఇటీవల రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధిం చిందని టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు ప్రశంసించడం నిజం కాదా అని ప్ర శ్నిం టచారు. కేసీఆర్ పాలన గురించి రేవం త్ రెడ్డి పిలిచిన అతిథులే పొగడటం రుచించ లేదా అని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయం లో దేశానికే తలమానికంగా తెలంగాణను నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మూడు రెట్లు జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరగడం వాస్తవం కదా అని హరీశ్ రావు అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ పెరిగినట్లుగా రేవంత్ రెడ్డే చెప్పారని..
రూ.50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ కొనుగోలు చేసినట్లుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బయట పెట్టాడని గుర్తు చేశారు. నిజాయితీగా త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం తమదని.. పుట్టుక, చదువు, నౌకరీ ఒకే చోట చేస్తున్నారని, రేపు ఎక్కడో తెలియదంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ నిన్న ప్రెస్‌మీట్ పెట్టగానే వెంటనే రేవంత్ రెడ్డి చిట్‌చాట్ పెట్టడం.. ఆయన ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో సీఎంగా పనిచేస్తున్నాడో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.