calender_icon.png 4 September, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేయాలని వృద్ధురాలి ఆందోళన

02-09-2025 12:12:45 AM

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): చింతల మానేపల్లి మండలం డబ్బ గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వృద్ధురాలు చాపిడి సోంబాయి కి  సంబంధించిన భూమిని కొందరు వ్యక్తులు ఆమె మృతి చెం దినట్లు రికార్డులు సృష్టించి, పట్టా చేసుకున్నారు.

ఈ విషయంలో వృద్ధురాలు గత నె ల  నాలుగో తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టగా, సత్వరమే  స్పందించిన  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల స్పష్టమై న హామీ ఇవ్వడంతో వృద్ధురాలు ఆందోళన విరమించింది.   గత రెండు రోజుల క్రితం మళ్లీ ఆ భూమిలో ప్రహరీ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు భూమి పూజ చేయడంతో వృద్ధురాలు పాటు, ఆమె కుటుంబ సభ్యు లు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు అధికారులను వేడుకుంది.   ఆమెతోపాటు కూతుర్లు రుక్మిణి, విమల మనమరాళ్లు లక్ష్మి, జ్యోతి ఆందోళన చేస్తున్న వారిలో ఉన్నారు.  సిపిఎం పార్టీ కార్యదర్శి ముంజం  ఆనంద్ కుమార్, తదితరులు ఆందోళనకు మద్దతు తెలిపారు.