25-01-2026 12:45:15 AM
శివ కందుకూరి హీరోగా, తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘చాయ్‌వాలా’. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వీ పాపుడిప్పు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్యకృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో సజ్జనార్ మాట్లాడుతూ.. “మన జీవితంలో చాయ్ ఎంతో ముఖ్యంగా మారింది.
ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. అందరూ ఈ మూవీని చూసి హిట్ చేసి, యంగ్ టీమ్‌ని ఆశీర్వదించాలి” అన్నారు. నీలోఫర్ కేఫ్ ఎండీ శశాంక్ మాట్లాడుతూ.. “నేను ఎక్కువగా సినిమాలు చూస్తాను. మా నాన్న బాబురావు అస్సలు సినిమాలు చూడరు. కేవలం ‘చాయ్ వాలా’ అనే టైటిల్ చూసి ఇక్కడకు వచ్చారు. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ను చక్కగా చూపించబోతోన్నారు” అని చెప్పారు.
కథానాయకుడు శివ కందుకూరి మాట్లాడుతూ.. “చాయ్ వాలా’ సినిమాలోని భావోద్వేగాలు అందరినీ కట్టి పడేస్తాయి. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం” అని తెలిపారు. డైరెక్టర్ ప్రమోద్ హర్ష మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి రాజీవ్ కనకాల ప్రాణం. శివ అదరగొట్టేశారు. నేను ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నా” అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “నటుడిగా శివ నాకు చాలా ఇష్టం. నాలోని యాక్టింగ్ స్కిల్‌ను బయటకు తీసుకు రావడానికి శివ యాక్టింగ్ కూడా ఓ కారణమైంది.
హీరోయిన్ తేజు కూడా చక్కగా నటించారు. ఈ సినిమాతో ప్రమోద్‌కు కచ్చితంగా విజయం దక్కుతుంది” అని తెలిపారు. చిత్ర సహ నిర్మాత వెంకట్, కెమెరామెన్ క్రాంతి వర్ల, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి, గీత రచయిత సురేశ్ బనిసెట్టి, ఎడిటర్ పవన్ నరవ, స్క్రీన్‌ప్లే రైటర్ ఇమ్రాన్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. వివిధ రంగాల ప్రముఖులు బాబురావు, రవికిరణ్‌వర్మ, సత్యనారాయణ, శశాంక్, రాజ్ కందుకూరి ఈ వేడుకలో పాల్గొన్నారు.