calender_icon.png 2 August, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి

31-07-2025 12:00:00 AM

నిజామాబాద్ జులై 30: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని రెండో విడతలో కోర్సులను ఎందుకు పెట్టలేదో యూనివర్సిటీ అధికారులు బహిర్గతం చేయాల సుశీల విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు వాళ్ళు నిజామాబాద్ నగరంలో ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలు  విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇంజనీరింగ్ కళాశాల సాధన సమితి ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్టు పిడిఎస్ యూ నాయకులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సులు రెండో విడతలో ఎందుకు అలా సత్యం జరుపుతున్నారు అందుకు సంబంధించిన వివరాలను వెంటనే బహిర్గతం చేయలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో ర్యాలీ ధర్న నిర్వహించారు