31-07-2025 12:00:00 AM
- మూగజీవాలకు మందులేవీ..?
-ఏడాదిగా నిలిచిన సరఫరా
- ప్రతిపాదనలకే పరిమితమైన మరమ్మతు పనులు
-వైద్య సిబ్బంది కొరతతో మూగ జీవాలకందని వైద్యం
-వ్యాధుల బారిన మూగజీవాలు
-ప్రైవేట్ బాట పడుతున్న పోషకులు
మణుగూరు, జులై 30,( విజయ క్రాంతి) : రైతులు ప్రాణం కన్న ఎక్కువగా ఆదరించి,ఆశలు పెట్టుకునే పశువులకు రోగం వస్తే వైద్యం అందక మృత్యువాత పడాల్సిన పరిస్థితి నెలకొం ది. సబ్ డివిజన్ పరిధిలోని పినపాక, కరకగూడెం, అశ్వాపు రం, మణుగూరు మండలాలలో గ్రామీణ పశువైద్యానికి సుస్తీ చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. పశువైద్యంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ దుర్భర స్థితి కి కారణమని, పాలకులు చూస్తూ ఉన్నారే తప్ప పట్టించు కోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూగజీవాలకు మందులేవీ..?
సబ్ డివిజన్ పరిధిలో పశువుల ఆస్పత్రులు, సబ్ సెంటర్ లలో మందుల నిల్వలు నిండు కున్నాయి. ఏడాదిగా మూగజీవాలకు మందుల సరఫరా నిలిచిపో యింది. దీంతో, యాం టిబయాటిక్స్ మినహా ఇతర చికిత్సలకుఅవసరమైన మందు లు అందుబాటులో లేవు. పశువులకు సంక్రమించే వ్యాధుల ను బట్టి మొత్తం 108 రకాల మందులు ఏటా రెండు పర్యాయాలు సరఫరా కావాల్సి ఉండగా, గతేడాది ఆగస్టులో సరఫ రా చేసిన తర్వాత ఇప్పటివరకు ఆస్పత్రులకు మందులు రాలే దు. లివర్ టానిక్, కాల్షియం సస్పెన్షన్, విటమిన్ ఎ, మిల్క్ ప్లస్ బోలస్, పిడిపోట్, గ్నానా రిచ్, ట్రిబివెట్ వంటి మం దులు లేకపోవడంతో పాడి రైతులు బయట మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రవేట్ డీలర్లు మం దుల ధరలను పెంచేశారు. దీంతో చేసేదేం లేక పశువులను రక్షించుకు నేందుకు అధిక ధరలకు మందులు కొనుక్కోవాల్సి వ స్తుండడంతో పెంపకం దార్లకు పశువుల పెంపకం భారంగా మారిందనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సదుపాయాలు, సిబ్బంది కొరతతో వైద్యుల అవస్థలు
ఏటా వర్షాల సమయంలో పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర జంతువులు వ్యాధుల బారిన పడుతు న్నాయి. పశువులకు జబ్బు చేసినప్పుడు తగినంత మంది సిబ్బంది లేకపోవ డంతో సకాలంలో వైద్యం అందటం లేదు. పశు వైద్యశాలల్లో సిబ్బంది తోపాటు మందుల కొరత, ఆధునిక పరికరాలు లేకపోవడంతో మూగజీవాల పోషకులుప్రైవేట్ బాట పడుతు న్నారు. పలుపశు వైద్య కేంద్రాల్లో డాక్టర్లుఉంటే. సిబ్బంది లేరు. సిబ్బంది ఉంటే డాక్టర్లు లేరు అన్న చందంగా పరిస్థితి నెలకొంది . దీంతో పశువులకు వైద్యం అందక రోదిస్తున్నాయి. సిబ్బంది కొరతతో మూగజీవాల వేదన అరణ్య రోదనగామిగులుతోంది. దీంతో పశుపోషకలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప పశు వైద్య కేంద్రాలు కూడా సిబ్బంది లేక వెల వెల బోతున్నాయి.
వ్యాధుల బారిన మూగజీవాలు
వర్షాకాలంలో పెద్ద పశువుల్లో గాలి కుంటు వ్యాధి, గొ ర్రెల్లో నీలి కాలుక, గిరక వాపు వ్యాధులు, మేకలను జలుబు, దగ్గు వ్యాధులు సంభ విస్తున్నాయి. బ్యాక్టరీయా వల్లే ఇవి ఎ క్కువగా వస్తాయని వైద్యులుచెప్తున్నారు. మందులు, చికిత్ససరి గా అంద కపోవడంతో కొన్ని చోట్ల పశువులు మృ త్యు వాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి.సీజనల్ వ్యాధుల తో సతమతం వర్షాల కారణంగా గాలిలోతేమ శాతం అధికం గా ఉండటంతో ముఖ్యంగా గొర్రెలు, మేకలు నీలి నాలుక రో గం, మూతివాపు, జొల్లువాపు, కాలుగిట్టలలో పుండు వ్యాధులు ప్రబలు తున్నాయి.
వీటికి ప్రతీ ఏటా రెండుసార్లుటీకాలు వే యాల్సి ఉంది. కానీ కనీసం మందు బిళ్లలు కూడా కరువయ్యాయని రైతులు అంటున్నారు. ప్రైవేటు మెడికల్ షాపుల ను ఆశ్రయించి ప్రైవేటు కాంపౌండర్లు లేదా తామే స్వయంగా వైద్యం చేసుకుం టున్నామని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశువైద్యశాలలో మందులను అం దుబాటు లోకి తీసుకురావాలని సిబ్బందిని, డాక్టర్ ను పూర్తి స్థాయిలో నియమించాలని, ప్రజలు కోరుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
సీజనల్ వ్యాధుల పట్లపాడి రైతులకు ఎప్పటిప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. సకాలంలో జీవాలకు టీకాలు వేస్తు న్నాం. గొర్రెల్లో నీలినాలుక వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేశాం. అలాగే 1962 నెంబర్‌కి కాల్ చేస్తే సంచార పశువైద్య అంబులెన్స్ మీ వాకిట్లోకి వచ్చి వైద్యం అందిస్తుంది. రైతులకు సంచార పశువైద్యం వల్ల ఎంతో మేలు కలగనుంది.
డాక్టర్. ఎనమల్ల సరస్వతి, మండల పశువైద్యాధికారి