calender_icon.png 15 October, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు స్ఫూర్తి ప్రదాత

15-10-2025 12:03:52 AM

నేడు ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి :

పేదగా పుట్టడం తప్పు కాదు. కానీ పేదగా మరణించడం మాత్రం తప్పే!’ అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ వ్యాఖ్యానించారు. పేద కుటుంబంలో పుట్టి, కష్టాలనే ఇష్టంగా మార్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ దేశం గ ర్వించదగిన శాస్త్రవేత్తగా, భారత ప్రథమ పౌరుని పీఠాన్ని అధిరోహించిన అబ్దుల్ కలాం జ యంతి నేడు. ఈరోజును ఆ యన దేశానికి చేసిన సేవలను మాత్రమే కాకుండా, ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా కూడా జ రుపుకుంటూ వస్తున్నాం.

రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజలందరినీ, ముఖ్యంగా యువతను ఉ త్తేజపరిచిన ఒక గొప్ప దార్శనికుడు, ఉపాధ్యాయుడు అబ్దుల్ కలాం. అపారమైన ఆత్మవిశ్వాసం, మేధో సంపద కలగలిసిన కలాం.. భారతదేశాన్ని అంతరిక్ష, అణు శక్తి గల దేశాల సరసన నిలబెట్టి ‘మిస్సుల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా’ ప్రసిద్ధికెక్కారు. శాస్త్రవేత్తగా ఆయన సాధించిన విజయాలు భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశాయి. డీఆర్డీవో సెక్రటరీగా అటామిక్ ఎనర్జీ సహకారంతో పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

ఇదే మన దేశాన్ని అణ్వాయుధ దేశంగా మార్చింది. తేలికపాటి యుద్ధ విమానం సహా అనేక మిషన్ ప్రాజెక్టులకు ఆయన తన సహకారమందించారు. ఒక సైంటిస్ట్‌గా మహోన్నత దశను చూసిన అబ్దుల్ కలాం ఆ తర్వాత దేశ రాష్ట్రపతిగానూ తన సేవలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచా రు. దేశానికి 11వ రాష్ట్రపతిగా ఆయన పని చేసిన తీరు, నిరాడంబరత, పిల్లలతో కలిసి మాట్లాడే విధానం కారణంగా ‘ప్రజా రాష్ర్టపతి’గా సు ప్రసిద్ధులయ్యారు.

‘భారతదేశం కోసం నా మూడు కలలు.. అవే స్వేచ్ఛ, అభివృద్ధి, ప్రపంచానికి సమానంగా నిలబడటం’ అని కలాం తన ఆలోచనను బయటపెట్టారు. భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం కా దని.. అభివృద్ధి చెందిన దేశంగా భావించాలని పదేపదే చెప్పుకొచ్చారు. రాష్ట్రపతిగా సేవలందిస్తున్న సమయంలో కలాం దేశవ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థులను కలుస్తూ జాతీయ అభివృద్ధి కోసం కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కలాం చెప్పినట్లుగా మన దేశంలో స్వయం సమృద్ధి లేకపోవడం, ఉద్యోగాల కోసం చదివే విద్య లాంటి సమస్యలు ఇప్పటికీ పూ ర్తిగా పరిష్కారం కాలేదు. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన యువతరం నేటికీ సరైన ఉపాధి కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. కలాం కన్న కలలను సాకారం చేయడానికి కొన్ని సవాళ్లు అధిగమించాల్సిన అవసర ముంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను, నిజాయితీతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంచాలి.

విదేశీ సాంకేతికతను దిగుమతి చేసుకోవడం కంటే, మన దేశంలోనే ప్రపంచ స్థాయి పరిశోధనలు పెరిగేలా తోడ్పాటు అందించాలి. ఆయన రచించిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ వంటి విలువైన గ్రంథాలు క లాం స్ఫూర్తిని సజీవంగా ఉంచుతున్నాయి. ఇవళ భౌతికంగా  ఆయన మ న మధ్య లేకపోయినా కలాం వెలిగించిన విజ్ఞాన జ్వాల మా త్రం ఇప్పటి కీ లక్షలాది మంది హృదయాల్లో ప్రకాశవంతంగా వెలుగుతూ నే ఉంది. ఇదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.

 వ్యాసకర్త: మోహన రావు