calender_icon.png 15 October, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువను పెంచిన నోబెల్

14-10-2025 12:00:00 AM

నోబెల్ శాంతి బహుమతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకు న్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరికు నిరాశే ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సారి నోబెల్ శాంతి బహుమ తిపై ఎడతెగని ఉత్కంఠ కల్గిన మాట వాస్తవమే. దీనికి కారణం అవార్డు రేసులో ట్రం ప్ ఉండడమే. తన వల్లనే ప్రపంచంలో శాంతి సుస్థిరతలు వెళ్లి విరుస్తున్నాయని, వివిధ దేశాల మధ్య ఎనిమిది యుద్ధాల ను ఆపానని పదేపదే ప్రకటించి యావత్ ప్రపంచాన్ని సందిగ్ధంలోకి నెట్టివేశారు. చివరకు అన్ని పరిశీలించిన నోబెల్ జ్యూరీ కమిటీ ఈ సంవత్సరం శాంతి బహుమతి ని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, మా నవ హక్కుల ఉద్యమకారిణి మరియా కొరీనా మచాడోకు ప్రకటించింది.

అయితే కొసమెరుపు ఏంటంటే ఈ అవార్డును ట్రంప్‌కే అంకితమిస్తున్నట్లు మరియా కొరీ నా ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముం చెత్తారు. ట్రంప్‌కు నోబెల్ చేజారినప్పటికీ అమెరికా పర్యవేక్షణ లేకుండా అడుగు కూ డా ముందుకు వేయని ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం (ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్) ట్రంప్ కు ఇస్తున్నట్లు ప్రకటించి అతన్ని కాస్త శాంతించేలా చేసింది. మొత్తానికి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా దానికున్న ప్రాముఖ్యతను గుర్తించిన నోబెల్ జ్యూరీ కమి టీ సభ్యులు అవార్డును అర్హత ఉన్నవాళ్లకే ఇచ్చి దాని విలువను మరింత రెట్టింపు చేశారు.

పాలకుడే మూర్ఖుడైతే

‘పాలకుడు మూర్ఖుడయితే ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి’ అని చెప్పడానికి ప్రపంచ చరిత్రలో ఎన్నో సంఘటనలను ప్రస్తావించవచ్చు. చంచల మనస్తత్వం, దూకుడు స్వభావం కల్గిన ట్రంప్ ఇరాన్‌లోని మూడు అణ్వస్త్ర స్థావరాలపై (నతాం జ్, ఫోర్డో, ఇస్పహాన్) బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగించారు. ఇరా న్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి తన ప్రమేయం లేకు న్నా సినిమాలలో తళుక్కున మెరిసే అతిధి పాత్రలాగా విధ్యంసరచన చేసి ఒక చెడు ముద్రను వేసుకున్నారు. ఇక్కడ ప్రత్యర్ధి ఇరాన్ ను నెతన్యాహు, అమెరికా  తక్కువగా అంచనా వేశా యి.

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే త్వరగా లొంగిపోతుంది. అక్కడి పాలకుల తో కాళ్ళ భేరానికి రప్పించి అణ్వస్త వ్యాస్తి నిరోధక చట్టంమీద సంతకం చేయించుకోవాలని చూశారు. కానీ వారు అనుకున్న ట్లుగా జరుగలేదు. ఫలితంగా రెండు వైపు ల పది రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరాన్ వైపు సుమారు ఎనిమిది వందల మంది.. ఇజ్రాయెల్ వైపు వంద మంది పౌరులు మరణించినట్లు సమాచారం. ఈ పది రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ రక్షణ కవచం (ఐరన్ డోమ్) ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్ళ ముందు తలవంచా ల్సి వచ్చింది. ఫలితంగా ఈ 77 సంవత్సరాల కాలంలో ఇజ్రాయెల్‌కు జరిగిన నష్టం ఇరాన్ తో ఈ పది రోజుల యుద్ధం లో జరిగింది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా హు అమెరికాను ముగ్గులోకి దించి ఇరాన్‌లోని  అణ్వస్త్ర స్థావరాలను ధ్వంసంచేసి సంతృప్తి పడొచ్చు. కానీ ఇరాన్ అంతర్జాతీయంగా ఈ యుద్ధం ద్వారా ప్రపంచాని కి ఓ గట్టి హెచ్చరికను ఇవ్వగలిగింది. గత ఇరవై ఒక్క నెలలుగా ఇజ్రాయెల్ గాజాలో ఎంతటి నరమేధం సృష్టిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తూనే వస్తున్నది. పాలస్తీనాలో ఇప్పటి వరకు 67వేల మందికి పైగా చనిపోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. మృతి చెందిన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులే ఉన్నారు. హ మాస్ అంతమే లక్ష్యంగా దాడులకు దిగామని చెబుతూ వచ్చిన ఇజ్రాయెల్ ఈ 21 నెలల్లో గాజా ప్రాంతం మొత్తాన్ని నేలమట్టం చేయడం తప్ప చేసిందేమి లేదు. దీనివల్ల అక్కడి ప్రజల జీవితాలు  చిన్నాభిన్నమయ్యాయి.

మాట తప్పిన వేళ

ఆపరేషన్ సింధూర్ విషయంలో కూ డా అనవసరంగా తలదూర్చి తానే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చానని పదేపదే లీకులు ఇచ్చి మన నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసే ప్ర యత్నం చేయడం గమనార్హం. మరి ఇ ప్పుడు పాకిస్తాన్ అధికార గణం మళ్ళీ ట్రంప్‌ను నెత్తిన పెట్టుకొని ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇవ్వాలని మళ్లీ సిఫార్సు చే స్తుందేమో చూడాలి. ఇది చాలదన్నట్లుగా ట్రంప్ పేరును తన మిత్ర బృందంతో పాటుగా అమెరికా ప్రతినిధుల సభ సభ్యు డు బడ్డి కార్డర్ నార్వేలోని నోబెల్ కమిటికి లేఖ పంపించడం గమనార్హం.

అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ట్రంప్‌ను కలిసి నోబె ల్ శాంతి బహుమతికి ఇజ్రాయెల్ దేశం సిఫారసు చేస్తున్నట్లుగా అధికారిక లేఖను కూడా అందించారు. గతం లో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామకు 2009లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య శాంతి సుహృ ద్భావ వాతావరణం, అలాగే దేశాల మధ్య సమన్వయం కుదిర్చినందుకు గాను “శాంతి బహుమతి’ ప్రకటించిం ది. దీనిపై అప్పట్లో అనేక స్వచ్చంద సంఘాలు, కొన్ని దేశాల నుంచి పెద్ద ఎత్తున వివమర్శలు వచ్చాయి.

అయి తే ట్రంప్ రెండోదఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడిన సమయంలో తన హయాంలో ఎలాంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణం ఉండదని చెప్పి వ్యూహాత్మకంగానే ఇజ్రాయిల్‌తో పాలస్తీనాలోని ‘హమాస్’ తిరుగుబాటుదారుల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటింపజేశారు. అయితే ఎన్నికలు పూర్తయి న మరుక్షణం నుంచే తిరిగి గాజాలో ఇజ్రాయిల్ సైన్యం మారణహోమం సృష్టించ డం ప్రారంభించింది. అక్కడ 24 గంటల్లో చిన్న పిల్లలకు ఆహారం దొరక్కపోతే సు మారు 14వేలకు పైగా చిన్న పిల్లలు చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా వినకుండా దాడులు కొనసాగించింది. మ రి ఇవన్నీ అమెరికా అధ్యక్షుడికి తెలియకుండానే జరిగాయా అంటే సమాధానం ఉండదు. 

అలా చేసి ఉంటే?

రెండో దఫా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచే ట్రంప్ ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి చేసే ప్రయత్నం చేసి ఉంటే నోబెల్ శాంతి బహుమతి విషయంలో ప్రపంచం మొత్తం ఇవాళ ఆయనకు అండగా నిలబడేదేమో. శాంతి కాముకుడనని తనకు తా ను ప్రకటించుకున్న ట్రంప్ ఇజ్రాయెల్, హ మాస్ మధ్య యుద్ధం ఆపేందుకు ప్రస్తు తం 20 సూత్రాల శాంతి ప్రణాళికలో భాగంగా తొలి దశ ఒప్పందం కింద ఇరు దేశాలు బందీలకు విముక్తి కల్పించినప్పటి కీ ఇది సరిపోదు. తక్షణమే పాలస్తీనా పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలి.

అ లాగే ఐక్యరాజ్య సమితి 1948లో చేసిన ఇజ్రాయిల్ ఏర్పాటుతో పాలస్తీనాకు కేటాయించిన భూ భాగాన్ని అమెరికా, ఇజ్రా యిల్, యురోపియన్ యూనియన్ దేశా లు కలిసి పాలస్తీనా ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేయాలి. త ద్వారా పశ్చిమాసియాలో నిత్యం రగిలే రా చపుండు మాదిరిగా ఉన్న పాలస్తీనా సమస్యకు శాశ్వతంగా తెరపడినట్లవుతుంది. అమెరికా ఒక వైపు నాటో సభ్య దేశాలు, యురోపియన్ యూనియన్ దేశాలతో కలిసి ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూనే మరోపక్క పరోక్షంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ వుంది. గత రెండున్నర సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి పరోక్ష కార ణం అమెరికానే.

దీనిని ప్రపంచం గమనిస్తూనే వస్తుంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరముంది. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేస్తే యు ద్ధం నిలిచిపోతుందన్న సంగతి చెప్పనవసరం లేదు. ఉగ్రవాద నిర్మూలనే అమెరి కాకు పెద్ద ఎజెండా అయినప్పుడు మన దేశంతో స్నేహం, పొరుగుదేశం పాకిస్థాన్‌తో ఒప్పందాలు లాంటి ద్వంద్వ నీతి వై ఖరిని మొదటి నుంచి అవలంబిస్తూనే వస్తున్నది. ఇది యావత్ ప్రపంచంలోని మేధావులను తొలుస్తున్న ప్రశ్న. అలాగే ఇజ్రాయిల్, యెమెన్, సిరియాలో కొనసాగుతున్న దాడులు కూడా ఆపేందుకు ట్రం ప్ మరిన్ని పరిష్కారాలు కనుగొనాల్సి ఉం ది. ఏదీ ఏమైనా ట్రంప్‌ను ఏరికోరి తెరుచుకున్న అమెరికా ప్రజలకు మిగిలిన మూడున్నర సంవత్సరాలు అమెరికా స మాజానికి, ప్రపంచానికి ఎలాంటి సందే శం ఇస్తాడో చూడాలి. 

 వ్యాసకర్త సెల్: 9908059234