calender_icon.png 15 October, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదురుతున్న ట్రేడ్ వార్!

15-10-2025 12:07:36 AM

అమెరికా, చైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం ముదిరినట్టుగా అనిపిస్తున్నది. ఇటీవల ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం (అక్టోబర్ 10) చైనా దిగుమతులపై 100 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.

ఈ సుంకాల అమలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే చైనాపై అ మల్లో ఉన్న 30 శాతం టారిఫ్‌లకు ఇది అదనం కాగా మొత్తం సుంకాల శాతం 130కి చేరినట్లయింది. ప్రపంచంలో చైనాలో మాత్రమే అరుదుగా లభించే రేర్ ఎర్త్ మినర్సల్ ఎగుమతులపై అక్టోబర్ 9న ఆ దేశం కఠిన ని బంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై విదేశీ కంపెనీలు వీటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

అయితే చైనాలో లభ్యమయ్యే రేర్ ఎర్త్ మినర్సల్ మాగ్నెట్లు, బ్యా టరీలు, సెమీ కండక్టర్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తాయి. రేర్ ఎర్త్ మినరల్స్‌కు సంబంధించి అమెరికా 80 శాతం చైనాపైనే ఆధారపడుతూ వ స్తుంది. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్ ‘చైనా మా దేశాన్ని బెదిరిస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్‌పై ఆంక్షలు పెట్టి తప్పు చేసింది. ఇందుకు వారి మూ ల్యం చెల్లించుకోవాల్సిందే.’ అని హెచ్చరికలు జారీ చేశారు.

అటు ట్రంప్ సుంకం విధించడంపై చైనా ఘాటుగానే స్పందించింది. అమెరికా యాజమాన్యం నిర్వహణలో ఉన్న నౌకలు, యూఎస్ నిర్వహించే లేదా ఆ దేశ జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. ప్రతిగా అమెరికా కూడా చైనా నౌకలపై ఫీజుల వ సూలును ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిజానికి అమెరికా, చైనా మ ధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటిది కాదు.

ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడైన సమయంలోనే ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ నడిచింది. 2017 ఏప్రిల్‌లో ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు. చైనాతో అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి అంగీకరించారు. వాణిజ్య చర్చల కోసం 100 రోజుల ప్రణాళికపై ఒప్పందం కుదిరింది. అ యితే ఈ చర్చలు విఫలం కావడంతో 2018 జనవరిలో చైనా నుంచి దిగుమతి చేసుకునే సౌర విద్యుత్‌పై దాదాపు 30 శాతం సుంకాలను వి ధించింది.

దీనికి ప్రతిచర్యగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 15 శాతం సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ట్రంప్ రెండో దఫా అధ్యక్షుడైన తర్వాత గత ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏకంగా చైనాపై 125 శాతం సుం కాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం.. దీనికి బదులుగా చైనా కూ డా అమెరికాపై సుంకాల మోత మోగించింది. ఆ తర్వాత ఇరుదేశాల మ ధ్య చర్చలు సఫలం కావడంతో ట్రంప్ దానిని 125 నుంచి 30 శాతానికి కుదించడం గమనార్హం. తాజా ఘటనతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెలాఖర్లో సౌత్ కొరియా జరగనున్న అపెక్ సమిట్ సందర్భంగా జిన్ పింగ్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పిం గ్‌తో భేటీ కావాల్సిన అవసరం తనకు లేదంటూ ట్రంప్ తాజాగా పేర్కొనడం ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్‌ను మరింత పెంచినట్లయింది. దీనికి ముగింపు ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుంది.