26-11-2024 12:00:00 AM
భైంసా, నవంబర్ 25: పింఛన్ ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడిని బురిడీ కొట్టించి రూ.19 వేలు కాజేసిన ఘటన భైంసాలో చోటుచేసుకున్నది. కుభీరు మండ లం మాలేగాం గ్రామానికి చెందిన గంగాధర్ సోమవారం భైంసాలోని ఎస్బీఐ బ్రాంచిలో రూ.30వేల నగదును డ్రా చేసుకున్నాడు.
ఇది గమనించిన ఓ దుండగుడు గంగాధర్‌ను కలిసి ప్రతి నెలా పింఛను ఇప్పిస్తాన ని, అందుకు రూ.19వేలు ఖర్చు అవుతుందని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. పత్రాల మీద డాక్టర్ సంతకం కావాలని గంగాధర్‌ను సమీపంలోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన గంగాధర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.