31-01-2026 03:49:46 PM
ఎస్పీ నితిక పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. నిషేధిత ఆయుధాల కలిగి ఉండటం, ప్రజలకు ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.