calender_icon.png 31 January, 2026 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే నెంబర్ 95/1పై రాజకీయం

31-01-2026 04:02:07 PM

అధికారుల నిర్లక్ష్యం లోపల రాజకీయం నడుస్తున్నట్లు అనుమానం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని కొత్తగా ఏర్పాటు అయినటువంటి అక్కంపల్లి గ్రామపంచాయతీకీ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం స్థలం కొరకు అక్కంపల్లి గ్రామస్తులు స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రకాష్, ఇంచార్జ్ డిప్యూటీ తాసిల్దార్ రాజేశ్వర్  వినతి పత్రాలు శనివారం అందజేశారు. ఇప్పటికీ పదిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఏమాత్రం స్పందించడం లేదని గ్రామ సర్పంచ్ వెంకగౌడ్, పాలకవర్గం,గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కంపల్లి జిపి రెవెన్యూ స్థలం గ్రామపంచాయతీ కొత్త బిల్డింగ్ కట్టడానికి సర్వేనెంబర్ 95/1లో భూమిని జిపి పరిధిలోకి ఇవ్వాలని అభ్యంతర మేముందని గ్రామస్తులతో, పాలకవర్గంతో కాలయాపన చేస్తూ వారి పనులను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కావాల్సి అధికారుల నిర్లక్ష్యంతో పాటు లోలోపల రాజకీయం చేస్తూ రెండు గ్రామాలకు గొడవలు సృష్టిస్తున్నారని అక్కంపల్లి గ్రామస్తులు తెలిపారు.సుమారు 230 మంది పాల్గొని అధికారులు డౌన్ డౌన్ అంటూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిరసన నిర్వహించారు.అక్కంపల్లి జిపికి నూతన గ్రామ పంచాయతీ భవనం మంజూరుతో పాటు వివోఏ బిల్డింగ్,మంజూరు అయిందని వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకగౌడ్,పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.