14-09-2025 09:39:33 AM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 1,32,395 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1091 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు
అలాగే శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) కూడా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులు రాగా.. అవుట్‌ఫ్లో 2.90 లక్షల క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఏడు గేట్లు ఎత్తి 1.94 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 212.43 టీఎంసీలుగా ఉంది.
నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయా(Nagarjuna Sagar Dam)నికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 310.25 టీఎంసీలు ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 3,25,00087 క్యూసెక్కులు ఉంది.