calender_icon.png 14 September, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం

14-09-2025 10:44:58 AM

గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ జిల్లా సంఘ్వి ఆర్గానిక్స్ పరిశ్రమ(Sanghvi Organics Private Limited)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందిదట్టమైన పొగలు, మంటలు దూరం నుండే కనిపించడంతో పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం ధాటికి ఘటనస్థలిలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి పదికి పైగా ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదం(Fire Accident) వల్ల జరిగిన నష్టం.. అలాగే ప్రమాదానికి గల కారణలు తెలియల్సి ఉంది. 

కాగా, గతంలో గుజరాత్‌లో ఏప్రిల్ 2న బనస్కాంత జిల్లాలోని దీసాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తర్వాత ఈ తాజా సంఘటన జరిగింది. ఒక పరిశ్రమ నుండి పనిచేస్తున్న అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా 21 మంది మరణించారు. వీరిలో చాలామంది మధ్యప్రదేశ్ నుండి వలస వచ్చిన కార్మికులే ఉన్నారు.