11-07-2025 12:46:42 AM
మణికొండ, జూలై 10: నార్సింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 1988 పదవ తరగతి చెందిన విద్యార్థులంతా గురువారం కె.వి.ఎం.ఆర్ గార్డెన్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా దాదాపుగా 150 మంది పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
తమకు విద్య బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం తాము చదివిన పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరు చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముకుందం రెడ్డి, సత్యనారాణ రెడ్డి, సీతాబాయి, పూర్వ విద్యార్థులు రమేష్, పి.సురేందర్ రెడ్డి, జయకృష్ణ, జి. రాజేందర్, ఓం ప్రకాష్ రెడ్డి, కె. రాజీరెడ్డి, సి. బీరప్ప, ఎన్. కేశవచారి, డి. సదానందం, కె. కల్పన, సుమ లు పాల్గొన్నారు.