calender_icon.png 7 September, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతరావుపల్లి నిర్వహణ అస్తవ్యస్తం

04-09-2025 12:00:00 AM

- పంచాయతీ కార్యదర్శి పనితీరుపై విమర్శలు 

- పడకేసిన పారిశుధ్యం, నాటని మొక్కలు 

- విష జ్వరాలతో ప్రజలు 

- ఆరోపణలు ఖండించిన పంచాయతీ కార్యదర్శి జ్యోతి

గజ్వేల్, సెప్టెంబరు 3: గజ్వేల్ మండలంలోని అనంతరావుపల్లి గ్రామపంచాయతీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇ బ్బందులు కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందని హరితహారం మొక్కలు నాటలేదని గ్రా మస్తులు వెల్లడించారు. ఈ పంచాయతీ కా ర్యదర్శి మాకొద్దు అనే వార్త కథనాన్ని విజ య క్రాంతి ప్రచురించిన విషయం తెలిసిం దే.

దాంతో బుధవారం గ్రామంలో పర్యటించిన పంచాయతీ కార్యదర్శి పై గ్రామస్తులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి అవసరమైన ఆర్థిక సహాయం అంది స్తామన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి సహకరించడం లేదని దాంతో నిర్వహణ అధ్వా నంగా మారిందని మండిపడుతున్నారు. ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు వేరువేరు నిబంధనలు విధిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన వేతనం ఇవ్వకుండా మాజీ ప్రజాప్రతి నిధులకు వంత పాడుతుందని చెప్పారు.

గ్రామంలోని డంపింగ్ యార్లు వినియోగించకపోవడం వల్ల చెత్త ఆలయ పరిసరాలలో వేయడంతో దుర్గంధం వెదజల్లుతుందన్నారు. గ్రామపంచాయతీ భవనం పూర్తిగా బురదమయం అయిందని పిచ్చి మొక్కలతో పేరుకుపోయిందని గ్రామస్తులు వెల్లడించా రు. గ్రామస్తులు విష జ్వరాలతో బాధపడుతుంటే పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని ఉన్నత అధికారులకు ఫిర్యా దు చేస్తే కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి పనితీరు మెరుగు పరచుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరావుపల్లి గ్రామ సమస్యలను బహిర్గతం చేసిన విజయక్రాంతికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు..

విజయక్రాంతిలో ప్రచురించిన కథనం పట్ల పంచాయతీ కార్యదర్శి జ్యోతి స్పందించారు. తాను ప్రభుత్వ నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్నానని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన శాయశక్తుల కృషి చేస్తున్నానని చెబుతూనే విజయక్రాంతి వార్తా కథనంపై మాట దాటవేశారు. గ్రామస్తులు ఉద్దేశపూర్వకంగా తన పై ఆరోపణలు చేస్తున్నారని, కొందరు వారికి అనుకూలంగా పనులు నిర్వహించాలని కోరారని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేనట్టు స్పష్టం చేయడం వల్ల తనపై కక్ష సాధింపుగా ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు. గ్రామంలో జరుగుతున్న ప్రతి పనిని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్లు వెల్లడించా రు.

నిధుల కొరత ఉండటం వల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్మికుల వల్ల చేయగలిగే పనులు మాత్రమే నిర్వహిస్తున్నామని యంత్రాలను వినియోగించడం లేదన్నారు.చెత్త సేకరణకు ట్రాక్టర్ వినియోగించకపోవడం వల్ల గ్రామంలో పారిశుద్ధ సమస్య తలెత్తుతుందని వెల్లడించారు.