04-09-2025 12:31:35 AM
హుజరాబాద్/తూప్రాన్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): యూరియా కోసం ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు పట్టనట్టు ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేది క వద్ద బుధవారం రైతులు ఆందోళన చేశా రు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద యూరియా టోకెన్లు ఇస్తామని అధికారులు చెప్పి తీరా రైతులు చేరుకున్నాక అధికారులు టోకరా ఇచ్చారు.
బుధవారం మండలంలో ని ప్రతి గ్రామ పంచాయతీ వద్దకు రైతన్నలు చేరుకొని టోకెన్ల కోసం పడికాపులు పడ్డారు. టోకెన్లు ఇవ్వకపోవడంతో దాతర్‌పల్లి, ఇ స్లాంపూర్ రైతులు గ్రామ పంచాయతీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్ రైతులు రహదారిపై బైఠాయించి యూరియా కొరతపై ఆందోళన చేపట్టారు. గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అని చప్పట్లతో నిరసన తెలిపారు.
కరీంనగర్ జి ల్లా హుజరాబాద్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని బుధవారం రైతులు ముట్టడించి, ధర్నా చేశారు. కార్యాలయానికి వచ్చిన ఏవో భూమిరెడ్డిని అడ్డుకొని యూ రియా సరఫరా ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు. పిఎసిఎస్ సంఘాలు, ప్రైవేటు ఫర్టిలైజర్ యజమాలు యూరియా బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు హుజురాబాద్‌కు వచ్చిన స్టాక్‌లో కొంత భాగాన్ని మాత్రమే పంపిణీ చేసి మిగతాది బ్లాక్ చేసి, అక్రమంగా అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా బస్తా కావాలంటే 20- 20, ఫొటాష్ వంటి ఇతర ఎరువులను కలిపి అంటగడుతున్నారని అ న్నారు. ఫర్టిలైజర్‌లకు ఎందుకు యూరియా సరఫరా చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పై అధికారులు చొరవ తీసుకోకపోవడంతోనే యూరియాను బ్లాక్ చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారి ఏవో భూమిరెడ్డి వారిని శాంతిప చేసి రెండు రోజుల్లో హుజురాబాద్ ప్రాంతానికి యూ రియా చేరుకుం టుందని, గతంలో టోకెన్లు పొందిన వారితో పాటు కొత్త వారికి కూడా యూరియా సరాఫరా చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
లారీని అడ్డుకున్న రైతులు
తరిగొప్పుల/కోరుట్ల రూరల్(విజయక్రాంతి): రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, గ్రామాలకు కేటాయించిన యూరియా ను అధికారులు సరిగా సప్లు చేయడం లేదని మాదాపూర్ గ్రామంలో రైతులు యూరి యా లారీని అడ్డుకున్నారు. మాదాపూర్, ఐలాపూర్ గ్రామాలలో రైతులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాలకు కేటాయించిన ఎరువులను వేరే గ్రామాలకు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఐలాపూర్ గ్రా మంలో ఇచ్చిన రైతులకే మళ్లీమళ్లీ యూరియాని ఇస్తున్నారని ఇవ్వని వారికి అసలే ఇ వ్వడం లేదని రైతుల ఆరోపించారు. యూ రియా పంపిణీలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించా రు. వ్యవసాయ అధికారి ని నాగమణి రైతులకు కావలసిన యూరియాను రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అందిస్తామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. తరిగొప్పుల మండల కేంద్రంలో గ్రోమోర్ గోదాం వద్ద రైతులు కుటుంబ సమేతంగా వచ్చి చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసం నిలుచున్నారు.
బడా భూస్వాములకే యూరియా?
గజ్వేల్/బెజ్జంకి: బడా భూస్వాములకు ఫర్టిలైజర్ వ్యాపారులు అధిక ధరలకు యూరియా అనుకుంటున్నారని, ఇందుకు వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తున్నారంటూ గజ్వేల్ మండల రైతులు ఆరోపించారు. బుధవారం టోకెన్లు ఇచ్చిన రైతులకు కూడా సరిపడా యూరియా పంపి ణీ చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కారు.
గత రెండు రోజులుగా ఇచ్చిన టోకెన్ల రైతులకే బుధవారం యూరియా పంపిణీ చేస్తా మని చెప్పినా కూడా వందమందికి పైగా రైతులు తమకు యూరియా లభించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో గజ్వే ల్ తూప్రాన్ రోడ్డులో భారీ సంఖ్యలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటన్నర తరువాత రైతులు వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో శాంతించారు.
పలువురు రైతులు తూప్రాన్ మార్గంలోని శ్రీనివాస ఆగ్రో ట్రేడర్స్ యజమాని చెన్నారెడ్డి రాత్రికి రాత్రే తమ దుకాణంలో యూరియాను బడా రైతులకు అమ్ముకుంటున్నాడని రైతులు ఆరోపించారు. బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. యూరియా బస్తాల టోకెన్లు, బస్తాలు పంపిణీ చేయకపోవటంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
యూరియా బస్తాలు పట్టుకెళ్లెందుకు యత్నం
మరిపెడ(విజయక్రాంతి): పక్షం రోజులుగా యూరియా కోసం తిరిగి తిరిగి వేసారినా కూపన్లు ఇచ్చి, బస్తాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుండడంతో ఆగ్రహించి ఆశ్రోషంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ సొసైటీ గోదాము నుండి సుమారు 80కి పైగా యూరియా బస్తాలను రైతులు పట్టుకెళ్లారు. రైతులంతా ఒక్కసారిగా గోదాములోకి చేరడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే గోదాం షట్టర్ కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న సీఐ రాజకుమార్ గౌడ్, ఎస్‌ఐ సతీష్ యూరియా బస్తాలు తీసుకెళ్లడం సరికాదంటూ వారించి అక్కడ నుంచి పంపించి వేశారు. తొర్రూర్ డీఎస్పీ కృష్ణకిషోర్ సంఘటన స్థలికి వచ్చి విచారణ చేపట్టారు.
రెండు రోజులుగా యూరియా కోసం వేలాది మంది రైతులు మరిపెడకు రాగా చాలామందికి టోకెన్లు ఇవ్వగా మంగళవారం 2 వేల బస్తాల యూరియా ఇచ్చి, మిగిలిన వారికి బుధవారం ఇస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. అయితే ఎంతకు అధికారులు యూరియా ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో రైతులు గోదాం ప్రహరీ దూకి లోనికి ప్రవేశించి యూరియా బస్తాలు తీసుకెళ్లినట్లు చెపుతున్నారు.