calender_icon.png 10 November, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మృతి తెలంగాణ కళా రంగానికి తీరని లోటు: రఘు

10-11-2025 10:23:44 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): డాక్టర్ అందెశ్రీ అకాల మరణం తెలంగాణ సాంస్కృతిక కళారంగానికి తీరని లోటని సీనియర్ కళాకారుడు వి రఘు అన్నారు. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా తెలంగాణ ఉద్యమంలో తన పాటలు, గాత్రంతో ప్రజలను ఉర్రూతలూగించి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కలలతో మేల్కొలిపిన ఉద్యమకారుడిగా అందెశ్రీ. తెలంగాణ సమాజానికి ఆయన ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహో తెలంగాణ, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, జై బోలో తెలంగాణ-నిలు వెల్ల గాయాల వీణ గీతాలు అందెశ్రీ కి చిరస్థాయి గుర్తింపు తెచ్చిందన్నారు.