10-11-2025 10:22:03 PM
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
మంజీరా నది నుంచి ఇసుక అక్రమంగా తరలింపు
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
రెండు గంటల నుంచి కొనసాగుతున్న ఆందోళన
బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ వద్ద నిరసనలు
కామారెడ్డి (విజయక్రాంతి): అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది టిప్పర్లతో అక్రమ ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా ఆగడాలను రైతులు అడ్డుకున్న ఉదాంతం మీది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం కోడిచెర్ల మందిర నది నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు. పోతంగల్ రహదారిపై ఇసుక టిప్పర్లను అడ్డుకొని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజు వందలాది టిప్పర్ల తో అక్రమంగా మంజిర నది నుంచి ఇసుకను తరలించకపోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇసుక మాఫియా టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించి డబ్బులు చేసి హైదరాబాద్, మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతినెల స్థానిక అధికారులకు ఇసుక దందా నిర్వాహకులు మామూలు ముట్ట జెప్పుతుండడంతో అధికారులు పట్టించుకోవడంలేదని రైతు లు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్న అక్రమ ఇసుక దందా మాత్రం జోరుగా కొనసాగుతుంది. మైన్స్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్రమ ఇసుక దందా నిర్వాహకులతో కుమ్మక్కై ప్రోత్సహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న టిప్పర్లను పోలీసులు సీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 20 టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు.
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ఇలా ప్రతిరోజు మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు తెలిపారు. గ్రామస్తులు గతంలో అడ్డుకున్న కూడా లెక్కచేయకుండా జోరుగా టిప్పర్ లసహాయంతో ఇసుకను తరలిస్తున్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తత చోటుచేసుకుంది. 20 ఇసుక టిప్పర్లను రైతులు అడ్డుకోవడంతో ఇసుక మాఫియా ఉన్నతాధికారులతో ఒత్తిడీలు చేపిస్తున్నట్లు సమాచారం. 20 టిప్పర్లను సీజ్ చేస్తేనే తాము నిరసన విరమిస్తామని రైతులు పేర్కొంటున్నారు. పోతంగల్ రహదారిపై 20 ఇసుక టిప్పర్లను నిలుపుదల చేసి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.