calender_icon.png 31 December, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లి కస్తూర్భా బాలికల పాఠశాల ఎదుట డ్రైనేజీ లీక్

31-12-2025 12:55:11 AM

తంగళ్ళపల్లి, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ కె.వి. కస్తూర్బా పాఠశాలల ముందు బురద నీరు నిలిచి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మరాజు మొగిలి తెలిపారు. పాఠశాలల ముందు డ్రైనేజీ పైపు లీక్ కావడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోయి బురదగా మారిందన్నారు.ఈ కార ణంగా పాఠశాలలకు వచ్చే విద్యార్థులు నడవడానికి ఇబ్బంది పడుతుండగా, పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రుల వాహనాలు స్కిడ్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.