calender_icon.png 31 December, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

30-12-2025 10:04:37 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషలతో ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధి, సమగ్ర సంక్షేమం కోసం స్వామి వారిని వేడుకున్నారు.