31-12-2025 12:55:45 AM
స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాం తి): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్’లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తి భావం, ఆధ్యాత్మిక ఆనందం తో మంగళవారం ఘనంగా జరిపారు. భగవంతుడు శ్రీమహావిష్ణువు తన ప్రియ భక్తుడు శ్రీ నమ్మాళ్వారును వైకుంఠ లోకానికి స్వయంగా స్వాగతించిన దివ్య ఘట్టానికి ఇది ప్రతీకగా నిలిచింది. ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అరుదైన అవకాశాన్ని కల్పించారు.
ఉదయం 5:15 గంటలకు వైకుంఠ ద్వార ప్రతి ష్ఠా కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని ముందు గా విశ్వగురు శ్రీల ప్రభుపాదులకు అందించా రు. అనంతరం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, రాధా గోవిందుల దివ్య దర్శనం భక్తులను పరవశింపజేసింది.
ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూ (ఎం.టెక్, ఐఐటి మద్రాస్) భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వైకుంఠ ఏకాదశి భగవంతుడు తన భక్తుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను తెలియజేసే పర్వదినం. తన ప్రియ భక్తుడు శ్రీ నమ్మాళ్వారు వైకుంఠానికి చేరుకున్నప్పుడు, భగవంతుడే స్వయంగా వైకుంఠ ద్వారానికి వెళ్లి ఆయనను స్వాగతించాడు అని చెప్పారు. ఈ పవిత్ర దినా న వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకునే భక్తులు భగవంతుడి కృపకు పాత్రులై, వైకుంఠ ప్రాప్తికి అర్హులవుతారు అని తెలిపారు.