30-12-2025 10:00:38 PM
చిట్యాల,(విజయక్రాంతి): గణిత ప్రతిభ పోటీలలో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైన విద్యార్థిని, ఉపాధ్యాయులను విద్యాధికారులు మంగళవారం అభినందించారు. జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయిలో దశరథ ఫౌండేషన్ వారి సహకారంతో టీఎంఎఫ్ నల్గొండ వారు నిర్వహించిన గణిత ప్రతిభ పోటీ పరీక్షలలో నల్లగొండ డివిజన్ స్థాయిలో జడ్.పి.హెచ్.ఎస్ చిన్నకాపర్తి చిట్యాల మండలం కు చెందిన పదవ తరగతి విద్యార్థి బి.దీపక్ రెడ్డి మొదటి ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి బి.బిక్షపతి చేతుల మీదుగా సర్టిఫికెట్, మెమెంటో, క్యాష్ ప్రైజ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చిట్యాల మండల విద్యాధికారి పి.సైదానాయక్ మాట్లాడుతూ... నల్గొండ డివిజన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన బి.దీపక్ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా మంచి ర్యాంక్ రావాలని కోరారు. ఈ సందర్భంగా మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా అభినందించారు. అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులు ఇటీవల వివిధ స్థాయిలలో మరియు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో రానించడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు.