calender_icon.png 5 September, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతువులకూ భావోద్వేగాలు

04-09-2025 01:19:06 AM

గాంధీ దర్శన్ ఎగ్జిబిషన్ సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్

ముషీరాబాద్,  సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): ప్రజలలో జంతువుల అంతర్గత విలువలు, హక్కులపై అవగాహన పెంచడం, జంతువులను గౌరవనీయమైన, భావోద్వేగాలు కలిగిన వ్యక్తులుగా గుర్తించవలసిన అవసరం ఉందని గాంధీ దర్శన్ ఎగ్జిబిషన్ సొసైటీ డైరెక్టర్, గాంధీయన్ సొసైటీ న్యూజె ర్సీ, యూఎస్‌ఏ సెక్రటరీ ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ అన్నారు.

వీగస్ ఇండియా మూవ్ మెంట్, వీగన్స్ ఆఫ్ తెలంగాణ సం యుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్పీసీసీజంకు వ్యతిరేకంగా ఈనెల 7వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఫ్రీడమ్ ఫర్ అనీమల్స్ పేరుతో ’అనీమల్ రైట్స్ మార్చ్- 2025’ను శిల్పారామం నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమా దర్శకుడు శశికిరణ్ టిక్క, దీపిక పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీటర్ మ్యారీస్ బర్గ్ దక్షిణాఫ్రికా బన్నీ బులా, వీఓటీ ఫౌండర్ ప్రెసిడెం ట్ సూరజ్ సీతారామ, సభ్యులు ప్రణయ్ ఉపాధ్యాయ, విశాల్ వంశీ, సిన్సమ్ ఫౌండేషన్ ఫౌండర్ ఇషాంత్ దూబేలతో కలిసి గొల్లనపల్లి ప్రసాద్ మాట్లాడారు. నేటి నాగరిక ప్రపంచంలో శరీర పోషణ కోసం జంతువులు,

వాటి ఉత్పత్తులు అవసరం అన్నది అతిపెద్ద అపోహ అని, మనం ఆరోగ్యంగా ఉండగలమని పాలు, మాంసం, గుడ్లు, తేనె ఇవేవీ మనకు అవసరం కాదని తెలిపారు. ప్యాకెట్ పాలు తాగడం వల్ల అమ్మాయిలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ, వాడకం విపరీతంగా పెరిగిపోయిందని దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని కోరా రు. మనిషి లోభం కోసం జంతువులను పెంచి దోపిడీ చేస్తున్నామని అన్నారు.