05-09-2025 06:01:13 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్లమెంటు ఇంచార్జ్ వెల్చాల రాజేందర్రావు ప్రోటోకాల్ ప్రకారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోలు లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం బిసి ఎస్సి వర్గాలను కించపరిచినట్లే వెంటనే వీరికి క్షమాపణ చెప్పాలని బీసీ సంఘాల జేఏసీ సమావేశం డిమాండ్ చేసింది. శుక్రవారం నగరంలో జరిగిన బీసీ జేఏసీ సమావేశానికి నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు దొగ్గలి శ్రీధర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... వెలిచాలా రాజేంద్రరావు ఏర్పాటు చేసే సమావేశాలలో దానికి సంబంధించిన ఫ్లెక్సీలలో బీసీ ఎస్సీ నాయకుల ఫోటోలను పెట్టకుండానే అవమానిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలలో బీసీలే జెండా ఎగరవేస్తున్నారు. దొరల ఆధిపత్యం లేకుండా పోయింది. బీసీలలో చైతన్యం వచ్చింది. బీసీలందరూ ఒకటయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలను బీసీలే కైవసం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా బీసీల ఎస్సీల వర్గాలను తక్కువ చూపు చూస్తే రాజకీయ సమాధి చేస్తారు. వెంటనే కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి స్థానం నుండి రాజేందర్ రావు గారిని తొలగించాలని బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.