04-09-2025 01:20:51 AM
కొత్త మైక్రోబ్రీవరీ-25 పాలసీకి ఎక్సుజ్‌శాఖ శ్రీకారం
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్‌శాఖ కొత్త మైక్రోబ్రీవరీ- 25 పాలసీకి శ్రీకారం చుట్టింది. మైక్రోబ్రీవరీల ఏర్పాటుకు అవసరమైన నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ జారీ చేసిం ది. ఈ నెల 3 నుంచి 25 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రతి దరఖా స్తుకు రూ.లక్షగా ధర నిర్ణయించా రు. మైక్రోబ్రీవరీలను బార్లు, ఎలెట్ బార్లు, క్లబ్‌లకు, టూరిజం స్థలాల్లోను, హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్ధలను అందజేసే సంస్థలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
మైక్రోబ్రీవరీల ఏర్పాటుకు అవసరమైన 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా చూసుకోవాల్సి ఉం టుంది. సంబంధిత శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను కలిగిన వారు మాత్రమే అర్హులు గా ఉంటారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, అదిలాబాద్, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లలో దరఖాస్తులను సంబంధిత ఎక్సుజ్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజన్‌లోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్, జవహార్‌నగర్, ఫిర్జాదిగూడ, నిజాంపేట్, రంగారెడ్డి జిల్లాలో బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్ మునిసిపల్ కార్పోరేషన్లతో పాటు జీహెచ్‌ఎంపీ పరిధిలోని ఉండే వారు దరఖాస్తులను ఎక్సుజ్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
బీరు కోసం వైన్ షాపునకు వెళ్లొద్దు!
బీరు కావాలంటే మద్యం దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. హోటల్‌కో, రెస్టారెంటుకో వెళ్లినపుడు అర్డర్ ఇచ్చిన టిఫిన్లతో పాటు చల్లటి బీరు కూడా అర్డర్ ఇచ్చి సేవించే అవకాశం కలుగనుంది. మైక్రో బ్రీవరీ పాలసీ ద్వారా ఈ అవకా శాల్సిన బీరుప్రియులకు అందించనుంది.