calender_icon.png 9 January, 2026 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారం అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదు

07-01-2026 07:54:59 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని  బుధవారం ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు  చొప్పరి సదానందం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ  బాలాజీ తో కలిసి ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మండలం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కమాన్ పూర్ మాజీ జడ్పిటిసి పుట్ట మధు ముత్తారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడడం సరికాదన్నారు. 

గత పది ఏండ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మండలంలోని రోడ్లన్నీ ఎంతటి అద్వాన్న పరిస్థితికి వచ్చాయో ప్రజలందరికీ తెలుసునని,  ఇప్పుడు మంత్రి చోరువతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారి,  మీకు అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం నుండి మీ మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న సొంత గ్రామం ఓడేడు వరకు రూ. 30 కోట్లతో రోడ్డు నిర్మించామని, ఇంకా అభివృద్ధి పనులు నడుస్తున్నాయి.

మీ ప్రభుత్వలో గంగాపురి నుండి ఓడేడు వరకు ఉన్న రహదారి ఇసుక లారీలతో గుంతలమయం చేసి నాశనం చేస్తే అ రహదారిని మంత్రి  రూ. 60 కోట్లతో  రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నామని, మచ్చుపేట గ్రామం నుండి బగుళ్ల దేవస్థానం వరకు రెండు కోట్లతో సిమెంటు రోడ్డు నిర్మించామని, దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయలకు పైగా వెచ్చించి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేస్తున్నమని, మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో రూ.60 లక్షలకు పైగా డబ్బులు వెచ్చించి అభివృద్ధి పనులను చేస్తున్నమని, పోతారం, దర్యాపూర్, శాత్రాజ్ పల్లి గ్రామాలలో నూతనంగా మంజూరు చేసిన సబ్ స్టేషన్లు మీకు కనబడడం లేదా అని,  రూ.12 కోట్ల కు పైగా మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన సిసి రోడ్లు, పాఠశాలల ఆధునీకరణకు వెచ్చించిన డబ్బులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.

పోతారం నుండి హరిపురం వరకు రెండు కోట్లతో చెరువు కట్టమీద మినీ ట్యాంక్ బండ్ కొరకు మంజూరు చేశామని, మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మీకు కనబడడం లేదా? అని అన్నారు. ఇప్పటికైనా సరే గత పదేళ్లలో మీ ప్రభుత్వ హయాంలో ముత్తారం మండలానికి అభివృద్ధి కొరకు మీరెన్ని కోట్లు వెచ్చించారో ఈ రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో ముత్తారం మండలానికి మా మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో అభివృద్ధి కొరకు మేమెన్ని కోట్లు వెచ్చించామో బహిరంగ చర్చ కైనా సరే సిద్ధమని సవాల్ విసిరారు. మంథని మండలంలోని సూరయ్యపల్లి నుండి ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీలోని  శుక్రవారంపల్లి వరకు రూ. 29 కోట్ల 15 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసిన శ్రీధర్ బాబుకు మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి ముత్తారం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కళ్ళు తెరిచి చూడాలని పుట్టమదుకు హితవు పలికారు.