అన్నదాత ఆగమాగం
16-05-2025 12:00 AM
పటాన్ చెరు, మే 15 :అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. బుధవారం సా యంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రైతులు ధాన్యాన్ని కాపాడుకోడానికి ఉ రుకులు పరుగులు పెట్టారు. జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వాన నుంచి ధా న్యాన్ని రక్షించుకోడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.
అలాగే వావిలాల, సోలక్ పల్లి, ఊట్ల గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేం ద్రాల వద్ద ఇదే పరిస్థితి. చేల వద్ద వరి ధా న్యం వర్షానికి నేల వాలింది. గురువారం ఉదయం ఐకేపీ ఏపీఎం నరేందర్ జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీ లించారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులుతెలిపారు.






