calender_icon.png 16 May, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

15-05-2025 11:26:28 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సింగరేణి బొగ్గును రవాణా చేస్తున్న టిప్పర్ లారీ వంతెనపై నుండి బోల్తా పడింది. ఈ ఘటన కోల్ బెల్ట్ ఏరియా(Coal Belt Area) రామకృష్ణాపూర్ ఆర్కేవన్ గని సమీపంలో గల పాలవాగు వంతెనపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మందమర్రి వైపు నుండి ఆర్కేపి సీఎచ్పికి వెళ్తున్న బొగ్గు లారీ పాలవాగు వంతెనపై వచ్చేసరికి ఎదురుగా టిజి 19 టి 1386 నంబర్ గల కారు అతివేగంతో రావడంతో కారును తప్పించబోయి లారీ అదుపుతప్పి పాలవాగు వంతెనపై నుండి కొత్తగా నిర్మిస్తున్న మరో బ్రిడ్జ్ పక్కన పడింది. వంతెన ఇరుకుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం తప్పింది. కాగా టిప్పర్ వాహనాల్లో ఉన్న బొగ్గు లోడ్ కింద పడిపోయింది. ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.