1 July, 2026 | 8:54 AM

ఈటలపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి

16-05-2025 12:00 AM

తెలంగాణ ముదిరాజ్ మహా సభ 

ఖైరతాబాద్;మే 15 (విజయ క్రాంతి):  మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముదిరాజ్‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌ డ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  గత రెండు రోజుల క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని తెలంగా ణ ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది.

ఈ మేరకు గురువారం సోమాజిగూడ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, ప్రధాన కార్యదర్శి అశోక్ లు మా ట్లాడారు.. రాజకీయ నాయకుల విమర్శలు విధానపరంగా ఉండాలి కానీ ఒక వ్యక్తిని కిం చపరిచేలా ఉండకూడదని అన్నారు.

కాం గ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలను మర చి దిగజారుడు రాజకీయలు చేస్తున్నదని దు య్యబట్టారు. కాంగ్రెస్ పెద్దలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని  ఈటెలకు బహి రంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సం ఘాలు నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాసభ స భ్యులు బాలు, రాజ్ కుమార్, లక్ష్మణ్, సోమ య్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.