07-11-2025 05:43:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ జూనియర్ కళాశాలలో శుక్రవారం వందేమాతరానికి 150 వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ అఖిలేష్ కుమార్ మహేష్ ఆధ్వర్యంలో వందేమాతర గీతాన్ని ఆలపించి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందేమాతర గీతం ప్రాధాన్యతను ప్రతి విద్యార్థి భవిష్యత్ తరాలకు వివరించాలని సూచించారు.