20-11-2025 12:37:45 AM
ఏడుగురు మావోయిస్టులు మృతి
అమరావతి, నవంబర్ 19 : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంప చోడవరం అటవీప్రాంతంలోని మారేడుమిల్లిలో మంగళవారం మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్, పీఎల్‌జీఏ కమాండర్ మడా వి హిడ్మా, ఆయన భార్య రాజే.. మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని గుజ్జుమామిడిలో బుధవారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది.
ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు మంగళవారం ఐదు జిల్లాల్లో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించగా, పోలీసులు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మంగళ, బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లను ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. హిడ్మాను పట్టుకుని భద్రతా దళాలు చంపా యనే ఆరోపణల్లో వాస్తవంలేదని స్పష్టం చేశారు. అలాగే వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధా లు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ మాజీ దళ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
గుజ్జుమామిడి ఎదురుకాల్పుల్లో మృతులను.. పార్టీ ఏవోబీ ఇంచార్జ్, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన మెట్టూ రి జోగారావు అలియాస్ టెక్ శంకర్, అలియాస్ శంకర్ బాబు, శివ, ప్రస్తుత డీసీఎం సభ్యురాలు, మాజీ మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బీఆర్ దాదా గార్డ్ కమాండర్ బూర్గులంక ప్రాంతానికి చెందిన జ్యోతి అలియాస్ సరిత (32), పార్టీ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు, ఏసీఎం, జగరగొండ ఎల్‌ఓఎస్, ఎఎస్‌బీటీ డీవీసీ, ఎర్రా కమ్యూ నికేషన్ బృందంలో పనిచేసిన సురేష్ అలియాస్ రమేష్, ఎస్‌బీటీ డీవీసీ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ దాదాకు అంగరక్షకుడు, ఏసీఎం లోకేష్ అలియాస్ గణేశ్, ఎఎస్ బీటీ డీవీసీ డిప్యూటీ కమాండర్, జాగర్‌గొండలాస్, ఏసీఎం, సైను అలియాస్ వాసు, జగర్‌గొండ ఎల్‌వోఎస్, ఎఎస్ బీటీడీవీసీగా పనిచేసిన ఏసీఎం అనిత, జగరగొండ ఎల్‌వోఎస్, ఎఎస్ బీటీ డీవీసీ సభ్యురాలు, ఏసీఎం షమ్మీగా గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే47 రైఫిల్స్, మరి కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను గుజ్జుమామి డి వలస అటవీ ప్రాంతం నుంచి రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కోర్టు ఎదుట 50 మంది హాజరు
ఏపీలోని ఐదు జిల్లాల్లో మంగళవారం అరెస్టయిన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. వా రందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులు బుధవారం మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా అనుచ రుడు మడివి సరోజ్‌రావ్‌ను అరెస్ట్ చేశారు.
కూంబింగ్ యథాతథం: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా
మారేడుమిల్లి అటవీప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోందని ఏపీ ఇంటెలి జెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవిబాటలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవడం మంచిదని, వెంటనే వారు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. హిడ్మా ఎదురు కాల్పుల్లోనే చనిపోయారయని, ఆయన్ను పట్టుకున్నాక చంపారనే విషయంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
కొందరు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ప్రయత్నిస్తున్నారని తమ నిఘా వర్గా లు గుర్తించాయని, అందుకే పటిష్ట నిఘా ఏర్పా టు చేసి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది ని అరెస్టు చేశామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గు రు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజినల్ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19 మంది ఉన్నట్టు చెప్పారు. త్వరలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతారని ఆయన చెప్పారు.
ఇన్‌స్పెక్టర్ మృతి, ఆరుగురు జవాన్లకు గాయాలు
చత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమ్మడి భద్రతా దళ బృందానికి చెందిన ఒక పోలీసు అధికారి మృతి చెందారు. ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ ఇన్‌స్పెక్టర్ ఆశిశ్ శర్మపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో అతని ఛాతీ, కడుపు, కాలుపై బుల్లెట్లు తగిలి చనిపోయారు. మరో ఆరుగురు గాయపపడ్డారు. ఆశిశ్‌శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజనంద్‌గావ్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
లొంగిపోవాలనుకునే వారు నాకు కాల్ చేయండి: మల్లోజుల
‘ప్రస్తుతం సమాజం మారింది.. పరిస్థితులను అర్థం చేసుకుని మేం ఆయుధాలను వీడాం’ అని మావోయిస్టు పార్టీ మాజీ దళ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. వరుస ఎన్‌కౌంటర్లు జరిగి, మావోయిస్టులు మిగిలిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చా రు. లొంగిపోయే దళ సభ్యులు తనను ఫోన్‌లో సంప్రదిం చవచ్చని చెప్పారు. అందుకు తన ఫోన్ నంబర్ 885603853ను కూడా మల్లోజుల వీడియోలో పేర్కొన్నారు.