20-11-2025 12:24:44 AM
రెండు విడతల్లో పంపిణీ
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆడబిడ్డలకు సారె. చీరె పెట్టడం తెలంగాణ సంప్రదాయమని, అందులో భాగంగానే ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు రాష్ట్రవ్యాప్తంగా రెండుదశల్లో చీరె లను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
తొలిదశలో బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరెల పంపిణీ జరుగుతుందని, ఇందుకు 65 లక్షల చీరెలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక రెండో విడత మార్చి 1 నుంచి 8 వరకు అంటే అంతర్జాతీయ మహిళ దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల చీరెలను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు సీఎం చెప్పారు.
బుధవారం సచి వాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, మహి ళా సమాఖ్యసభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రు లు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామ కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించి.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీర ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించా లని, నియోజకవర్గాల్లోని అన్ని మండలకేంద్రాల్లో విడతలవారీగా ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు.
ప్రజా ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక రాజకీయ కుల సర్వే డాటాను దగ్గర పెట్టుకుని ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని, చీర అందే సమయంలో ఆధార్‌ను తీసు కోవాలని, ముఖ గుర్తింపు చేపట్టాలన్నారు. ఇంది రా మహిళా శక్తి చీ రల పంపిణీపై కొందరు దుష్పచా రం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలన్నారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో ముందుకు..
దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘతన ఇందిరగాంధీకే దక్కుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ముందుకెళ్లుతోందని చెప్పా రు. దేశంలో రాజకీ య శూన్యత ఏర్పడి న సమయంలో ఇందిరగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని తెలిపా రు. అంబేద్కర్ ఆశయసాధన కోసం ఇందిరగాంధీ ఎంతో కృషిచేశారని సీఎం పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచడంతో పాటు ఇళ్లు కట్టించడం ఇందిరాగాంధీకే సాధ్యమైందన్నారు.
పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ దీటుగా నిలబడిన ధీశాలి అన్నారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని, మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని తెలిపారు.