20-11-2025 12:29:12 AM
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): గ్రూ ప్-2కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో టీజీపీఎస్సీ పాఠాలు నేర్వడం లేదనే విమర్శలు వినిపి స్తున్నాయి. పారదర్శకంగా నోటిఫికేషన్లను జారీ చేసి వాటి నియామక ప్రక్రియను చేపట్టే స్థాయి టీజీపీఎ స్సీకి అసలు ఉందా? అనే అనుమానాలు నిరుద్యోగు లు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్ప టి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ వివాదాలు, పరీక్ష వాయిదా, పేపర్ లీకేజీలు, ఫలితాలు లేదా నోటిఫికేషన్ రద్దు లేకుండా సామరస్యంగా జరగడం లేదు.
నోటిఫికేషన్ జారీ అయిన దగ్గర నుంచి పరీక్ష, ఫలితాలు, తుదిజాబితా విడుదల, నియామక పత్రాలు అందజేత ప్రక్రియ ఏ మాత్రం సాఫీగా సాగడం లేదు. కోర్టు మెట్లు ఎక్కకుండా పరీక్షలు, ఫలితాలు రద్దవ్వకుం డా ఉద్యోగ నియామక ప్రక్రియని విజయవంతంగా చేపట్టే స్థితిలో టీజీపీఎస్సీ లేదని అభ్యర్థులు బాహాటం గానే విమర్శిస్తున్నారు. టీజీపీఎస్సీ పారదర్శకతాలో పం, నిర్లక్ష్యం నిరుద్యోగులకు శాపంగా మారుతోందని అభ్యర్థులు ఆవదేన వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్-1, గ్రూ ప్-2, గ్రూప్-3, గ్రూప్-4.. ఇతర నోటిఫికేషన్ అయి నా ప్రతిసారి హైకోర్టు టీజీపీఎస్సీకి చివాట్లు పెడుతు న్నా పాఠాలు నేర్వడం లేదు. అనుభవాల నుంచి పాఠా లను నేర్చుకోకుండానే తప్పు మీద తప్పులు చేసుకుం టూ పోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు రద్దులు... ఆరు కోర్టు కేసులతో టీజీపీఎస్సీ పనితీరు సాగుతుంది. దాదాపు పదేళ్ల క్రితం జారీ చేసిన గ్రూప్ -2 నోటిఫికేషన్‌కు సంబంధించి సెలక్షన్ లిస్టును తాజాగా హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలతో టీజీ పీఎస్సీ పారదర్శకత, సామర్థ్యం, పనితీరుపై మరోసారి అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమువుతు న్నాయి.
గ్రూప్-2, గ్రూప్-1 అభ్యర్థులిద్దరిది ఒకటే పరిస్థితి
కొందరు అధికారులు చేసే నిర్లక్ష్యం, తప్పుల కారణంగా అభ్యర్థులు తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 2015లో టీజీపీఎస్సీ 1,032 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి గ్రూప్-2 ఇది. అయితే పరీక్షల నిర్వహణ తర్వాత ప్రశ్నపత్రం బుక్‌లెట్ విషయంలో గందరగోళం ఏర్పడటంతో బుక్‌లెట్ నంబర్ ఉండే పార్ట్-ఏలో తప్పులు జరిగాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ అప్పట్లో ఒక సాంకేతిక కమిటీ ని ఏర్పాటు చేసింది.
అయితే, ఓఎంఆర్ షీట్‌లో బుక్‌లెట్ నంబర్ ఉండే పార్ట్-ఏ, అభ్యర్థి వివరాలుండే పార్టీ-సీలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పర్వాలేద ని తేల్చింది. కానీ, సమాధానాలు గుర్తించే భాగమైన పార్ట్-బీలో ఏ మాత్రం వైట్‌నర్, దిద్దుబాట్లు, బ్లేడ్, ఎరేజర్ వాడి ట్యాంపరింగ్ చేసిన సదరు అభ్యర్థులను అన ర్హులుగా ప్రకటించాలని సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది.
అయితే టీజీపీఎస్సీ ఈ రెండింటినీ పట్టిం చు కోకుండా ట్యాంపరింగ్‌కు పాల్పడిన అభ్యర్థుల పేపర్ల ను కూడా పరిగణలోకి తీసుకొని ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాలను సవాల్ చేస్తూ 2019లో కొంద రు అభ్యర్థులు కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించాలని డివిజన్ బెంచ్ పేర్కొంది. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈనెల 18న 2019 ఫలితాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
మళ్లీ మూల్యాంకనం చేపట్టి, అర్హులైన వారికి 8 వారాల్లో నియామక ప్రక్రియను చేపట్టాలని ఆదేశించడం గమనార్హం. ఈ తీర్పు తో దాదాపు 300 మందికిపైగా అభ్యర్థులు ఉద్యోగా లు, జీవితాలు ప్రశ్నార్థకంలో పడ్డాయి. ప్రస్తుతం గ్రూప్-2 ఉద్యోగాలు పొంది వివిధ హోదాల్లో వీరు పనిచేస్తున్నారు. సెలక్షన్ లిస్టును రద్దు చేయడంతో వీరి స్థానాల్లో వీరి తర్వాత కింద వరసలో ఉన్న అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది. వీరి పేర్లతో లిస్టును రెడీ చేయా ల్సి ఉంటుంది. లేకుంటే టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌కు, లేదా సుప్రీంకు పోయే అవకాశం ఉంటుంది.
గ్రూప్-1 కేసు కూడా కోర్టు విచారణలోనే ఉంది. గ్రూప్-1ది ఇదే పరిస్థితి. మెయిన్ పరీక్షల్లో అవకతవకులు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన ఈ కేసు డిసెంబర్ 22న వాయిదా పడింది. అయితే గ్రూప్-1 కేసు వివాదం ఎటూ తేలకముందే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. గ్రూప్-1కు ఎంపిక కాని అభ్యర్థులు, ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్న గ్రూప్-1 ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు.
ఈ కేసుకు సం బంధించి తుది తీర్పును బట్టి అభ్యర్థుల పరిస్థితి ఉం టుంది. తమకు ఉద్యోగం వస్తుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కొందరు అభ్యర్థులు భావిస్తుంటే... తమ ఉద్యోగాలు ఉంటా యా? లేక ఊడుతాయా? అని ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్న వారు మరోపక్క ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పుకు లోబడే వారి నియామకాలు ఉంటాయనేది గమనార్హం.
అంటే వీరి ఉద్యోగాలు ఉండొచ్చు... లేకుంటే ఊడొచ్చనే అవకాశం ఉంది. లేదంటే కొత్తవారికి ఉద్యోగాలు రావొచ్చు. గ్రూప్-1, 2 రెండు నోటిఫికేషన్ల పరిస్థితి దాదాపు ఒకేలా ఉందనే అభిప్రాయాలను పలువురు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులను బట్టే ఎవరికి ఉద్యోగాలొస్తాయి? ఎవరికి పోతాయి? అనేది అప్పుడే తేలనుంది.