20-11-2025 12:12:16 AM
న్యూఢిల్లీ, నవంబర్ 19: ఎన్నికల కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై బుధవారం ఆయనకు దేశవ్యాప్తంగా 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఆర్మీకి చెందిన133 మంది రిటైర్డ్ అధికారులు విమర్శించారు. ‘ఓటు చోరీ’పై రాహుల్ గాంధీ చేసిన ఆరో పణలను కొట్టిపడేస్తూ ఎన్నికల సంఘాన్ని సమర్థించారు. భారత ఎన్నికల కమిషన్ వంటి రా జ్యాంగ సంస్థలపై కళంకం వచ్చేలా రాహుల్ గాం ధీ వ్యవహరించారంటూ పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సరైనదేనని, ఆ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి పునాది సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కించపరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీ నేతలెవరైనా రాజ్యాంగ సంస్థలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఓటు చోరీ పేరిట ఎన్నికల కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు.
రాజకీయ నేత లు విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా వారి రాజకీయ వ్యూహాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఈసీలో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వ్య క్తుల వరకు ఎవరినీ వదిలిపెట్టబోనని బెదిరిస్తుండడాన్ని కూడా లేఖలు రాసిన ప్రముఖులు తప్పుబట్టారు.
సర్ గురించి ఈసీ ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. ఈ ప్రక్రియలో అనర్హులును తొలిగించి, కొత్తవి అర్హత కలిగిన ఓటర్లను చేర్చడం మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు రాజకీయా లపై అతనికి ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా కన్పిస్తుందని అభిప్రాయపడ్డారు.