25-10-2025 12:39:37 AM
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24,( విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచలో మరో ప్రైవేట్ పాఠశాల బండారం వెలుగు చూసింది. పట్టణ పరిధిలో కొనసాగుతున్న ఏఐఎంఎస్ పాఠశాలకు ఉన్నత పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవు. రెండు సంవత్సరాల నుంచి అనుమతులు లేకుండా పాఠశాలను కొనసాగిస్తున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
పాఠశాల నిర్వహించాలంటే విద్యాశాఖ నుం చి అనుమతులు పొందాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలోని ఎలాంటి అనుమతులు లేకుండా ఏదేచ్ఛగా పాఠశాలను కొనసాగిస్తున్నారంటే విద్యాశాఖ అధికారులకు ఏ మేర కు ముడుపులు అందుతున్నాయో ఇట్టే చెప్పవచ్చు. అనుమతులు లేని పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తే నష్టపోఏ ది విద్యార్థులే. బోర్డులు చూసి, ప్రకటనలకు ఆకర్షితమై కొంతమంది ఆ పాఠశాలలో చేర్పిస్తుంటారు.
తీరా పరీక్షల సమయంలో ఇబ్బందుల పాలవుతున్న సంఘటనలు కో కోలలు. ఇప్పటికే నారాయణ ఇంగ్లీష్ మీడి యం పాఠశాల అనుమతుల వ్యవహారం గందరగోళంగా ఉంది. ఆ వ్యవహారం తేలకముందే ఏఎంఐఎస్ పాఠశాలకు 8, 9 ,10 తరగతులకు ఓపెనింగ్ పర్మిషన్ సైతం లేని వ్యవహారం వెలుగు చూసింది.
ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు అనుమతులు లేని పాఠశాలలపై దృష్టి సారించి చర్యలు తీ సుకోవాలని, విద్యార్థులు నష్టపోకుండా చూ డాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని విద్యార్థి సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. ఏఎంఐఎస్ పాఠశాల అనుమతుల విషయమై మండల విద్యాధికారి శ్రీరామ్ మూర్తిని వివరణ కోరగా ఉన్నత పాఠశాలకు అనుమతులు లేవని తమ దృష్టికి వచ్చిందని ఆ పాఠశాలపై చర్యలు తీసుకుంటామన్నారు.