calender_icon.png 25 October, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరస్పర సహకారం ఉండాలి

25-10-2025 12:15:34 AM

  1. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. ఆస్ట్రేలియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : శాసనాల తయారీలో పౌరుల భాగ స్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ ‘లీ తార్లామిస్’, పార్లమెంటరీ సెక్ర టరీ ‘షీనా వాట్’ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్‌ను వారికి వివరించారు. ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ- ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని చెప్పారు.

‘తెలంగాణ  విక్టోరియా’ మధ్య ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్‌ను పెంపొందించేందుకు చొరవ చూపా ల ని కోరారు. ప్రగతిశీల విధానాలను అనుసరి స్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న ‘తెలంగాణ’తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ‘లీ తార్లామిస్’, ‘షీనా వాట్’ తెలిపారు. ‘తెలంగాణ- విక్టోరియా’ మధ్య ద్వుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు  కృషి చేస్తామని హామీ ఇచ్చారు.   

ఉమ్మడిగా పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులు చేపడదాం

 అడ్వాన్డ్స్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సెన్సైస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, సస్టునబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులను రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రో గ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛే ంజ్‌లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్‌ను చేపట్టాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భా గంగా ఆయన శుక్రవారం మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీని సందర్శి ంచారు.

అనంతరం ఉమ్మడి పరిశోధన, ఇన్నోవేషన్ బేస్డ్ కొలాబరేషన్, అకడమిక్ ఎక్స్ఛే ంజ్, స్టార్టప్‌ల భాగస్వా మ్యం తదితర అంశాలపై యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చిం చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ లే హై వూ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ థామ్సన్ పాల్గొన్నారు.