25-10-2025 12:44:32 AM
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఇప్పటి వరకు 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించామని, ప్రైవేట్ రంగంలో కోట్లాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండేళ్ల క్రితం దీపావళి సందర్భంగా ప్రారంభమైన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11లక్షలకు పైగా యువతీ, యువకులకు నియామకపత్రాలను అందజేశామని చెప్పా రు.
కేవలం ఉద్యోగంలా కాకుండా దేశానికి, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా చూడాలన్నా రు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. యువత చిత్తశుద్ధి, అంకితభావం తోడై తే.. భారతదేశ ప్రగతిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. బషీర్ బాగ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన 17వ రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొ న్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లోని వేదికల ద్వారా మరో 51వేల మందికి నియామకత్రాలు ఇచ్చామని తెలిపారు. ఇందులో హైదరాబాద్ నుంచి 11 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 80మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందిం చామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నమైన ‘వికసిత్ భారత్ - 2047’ లక్ష్యాలను చేరుకోవడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.
ఈ రోజ్‌గార్ మేళా ఉద్యోకల్పన కోసం చేపట్టిన కార్యక్రమం మాత్రమే కాదు.. రేపటి దేశ భవిష్యత్తుకోసం యువతకు..అవకాశాలు కల్పించడం, ఎంపవర్ చేయడం, దేశసేవకు ప్రోత్సహించడం కోసమన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేది మోదీ స్వప్నమన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని తెలిపారు.
పాల ఉత్పత్తిలో ఫస్ట్..
పాల ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో, వరి, కూరగాయలు, పండ్ల, బొగ్గు ఉత్పత్తిలో రెండో స్థానంలో, సాఫ్ట్ వేర్ సేవల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఉన్నామని వివరించారు. ఇలా వివిధ రంగాల్లో భారతదేశం గత 11 ఏళ్లలో కీలకమైన ప్రగతిని సాధించిందన్నారు. ఈ 11 ఏళ్లలో తీసుకొచ్చిన ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణల కారణంగా.. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్‌లో.. ప్రస్తుతానికి 40వ స్థానానికి చేరుకున్నామని, త్వరలోనే మరింత పురోగతిని సాధిస్తామని తెలిపారు.
ఎన్‌ఈపీలో మార్పులు తీసుకొచ్చాం..
సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను మాతృభాషలో అందించేలా.. ఎన్‌ఈపీ 2020లో మార్పులు తీసుకొచ్చామని, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. ఇప్పటివరకు కోటి 25 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ అందించామని చెప్పారు. ఉద్యోగాల కోసం వేచి చూడటం కంటే.. ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలన్నది మోదీ ఆలోచన అని తెలిపారు. 2014లో 350 ఉన్న స్టార్టప్‌లు.. 2024 నాటికి 1.5 లక్షలకు పెరిగాయని, దేశంలో 100కు పైగా యూనికార్న్ స్టార్టప్‌లున్నాయని, వీటి ద్వారా 17 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు.
ఏఐలో అత్యంత వృద్ధిరేటు
ఏఐ అడాప్షన్‌లో అత్యంత వృద్ధిరేటు సాధించామని, ఫిన్-టెక్ అడాప్షన్ లో మొదటి ర్యాంకు, స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో మొదటి ర్యాంకు, రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుగా ఉన్నామని చెప్పా రు. ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా డిజిటల్ లావాదేవీలు కేవలం భారతదేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు.
రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో నాలుగో ర్యాంకులో ఉన్నామని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా.. అతిపెద్ద లోకోమోటివ్ మ్యాను ఫ్యాక్చరర్‌గా ఉన్నామని తెలిపారు. మోదీ ప్రభుత్వం మూలధన పెట్టుబడిని మరో 11శాతం పెంచిందని తెలిపా రు. మీ అభివృద్ధికి కృషి చేసిన తల్లిదం డ్రులను మర్చిపోకండని, వారిని గౌరవించాలని కిషన్‌రెడ్డి సూచించారు.