calender_icon.png 25 September, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయ్యారంలో ఏఎన్పీఆర్ ఏర్పాటు

25-09-2025 01:11:32 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): నేర నియంత్రణ, అనుమానిత వాహనాల గుర్తింపు కోసం మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిపై బయ్యారం వద్ద వాహనాల నంబర్ ప్లేట్లను ఫోటో తీయడానికి ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రిగగ్నైజ్డ్ కెమెరా (ఏ ఎన్ పి ఆర్) బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో అత్యాధునిక కెమెరాను సమకూర్చి ఏర్పాటు చేసినట్లు బయ్యారం ఎస్ ఐ కోగిల తిరుపతి చెప్పారు. ఏ ఎన్ పీ ఆర్ కెమెరా రహదారిపై వెళ్తున్న వాహనం యొక్క నంబర్ ప్లేట్ ను సునిశితంగా గుర్తించి రికార్డు చేస్తుందని చెప్పారు.

అంకెలతో పాటు నంబర్ ప్లేట్ పై ఉండే ఇంగ్లీష్ అక్షరాలను కూడా స్పష్టంగా రికార్డు చేస్తుందన్నారు. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసే ఈ కెమెరాను బయ్యారంలో అమర్చినట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దు కావడంతో ఇక్కడ కెమెరా ఏర్పాటు ఆవశ్యమని గుర్తించామని ఎస్ ఐ తెలిపారు. కెమెరా రికార్డింగ్ పూర్తిగా పోలీస్ స్టేషన్ లో ఉండే రికార్డు బాక్స్ లో వాహనాల రాకపోకలు నమోదు జరుగుతుందని చెప్పారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి తలెత్తిన, నేరాలకు పాల్పడి వాహనాల్లో పారిపోయే ఘటనలకు సంబంధించి ఈ కెమెరా దోహదపడుతుందని చెప్పారు.