25-09-2025 01:12:03 AM
రూ. 2.36 లక్షల విలువై మూడు ద్విచక్ర వాహనాలు, వస్తువులు స్వాధీనం
ముషీరాబాద్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 2.36 లక్షల విలువగల మూడు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీలు, ఇతర పూజా సామ గ్రి, ఇతర వస్తువుల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు.
ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జి. రాం బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ రాంనగర్ దయారా మార్కెట్లో అమీర్ పాషా అలియాస్ (అమీర్) (19) అనే వ్యక్తి వాషింగ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనాలు, పలు ఆలయాలలో పూజా సామగ్రి, వాహనాల బ్యాటరీలు దొం గతనానికి పాల్పడుతున్నాడు. అయితే ముషీరాబాద్ రిసాలకు చెందిన షా ఖయుముద్దీన్ ఖాళీగా ఉన్న స్థలంలో తనకు తెలిసిన వ్యక్తు ల వాహనాలను టాటా ఏస్ వాహనాలను ఆ స్థలంలో పార్క్ చేయడానికి అనుమతిస్తున్నాడు.
అయితే గత నెల 19న తమ వాహనాల నుండి బ్యాటరీలు అదృశ్యమవుతున్నా యని బాధితులు ఖయ్యూముద్దీన్ తెలపడంతో ఈనెల 20న ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి, అదనపు డీసీపీ బి. ఆనంద్, చిక్కడపల్లి ఏసిపి ఎల్. రమేష్ కుమార్‌ల ఆదేశాల మేరకు ముషీరాబాద్ డిఐ నదీమ్, ఎస్సై చలపతి రెడ్డి, క్రైమ్ సిబ్బం ది కిషోర్, ఉదయ్ కుమార్, దిలీప్ కుమార్, కార్తీక్ ల నేతృత్వంలో సీసీ ఫుటేజీల ఆధారంగా వాహనాల దొంగను పట్టుకొని విచా రించగా నేరాన్ని అంగీకరించినట్లు ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపారు.