calender_icon.png 25 September, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ మద్యం షాపులకు టెండర్?

25-09-2025 01:10:33 AM

దరఖాస్తు ఫీజుతోనే రూ.3 వేల కోట్లు రాబట్టాలని రాష్ట్రప్రభుత్వ యోచన

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో మద్యం షాపులకు టెండర్ల నోటిఫికేషన్ విడుదలకు అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దరఖాస్తుల ద్వారానే దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూర్చుకునేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 వైన్‌షాపులు ఉన్నాయి.

వైన్‌షాపుల టెండర్ కాల పరిమితి రెండేళ్ల వరకు ఉంటుంది. ఒక్కో షాపు కోసం దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నడుస్తున్న వైన్‌షాపుల కాల పరిమితి వచ్చే నవంబర్ 30వ తేదీతో ముగుస్తోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా టెండర్లు దక్కించుకున్న వారికి అబ్కారీ శాఖ వైన్ షాపులను కేటాయిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న వైన్‌షాపులకు 2023, అక్టోబర్ నెలలో టెండర్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా..

లక్షా 31 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించడంతో ప్రభుత్వ ఖజానాకు కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులు ఉండగా, ఒక గ్రేటర్ పరిధిలో హైదరాబాద్  సికింద్రాబాద్  సరూర్‌నగర్  శంషాబాద్  మల్కాజ్‌గిరి  మేడ్చల్  దుకాణాల చొప్పున మొత్తం 615 మద్యం షాపులు ఉన్నాయి.