calender_icon.png 3 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ చెస్ పోటీల్లో అంషిత సత్తా

03-01-2026 12:12:52 AM

ద్వితీయ స్థానం సాధించిన తెలంగాణ విద్యార్థిని

గువాహటి (అస్సాం), జనవరి 2: అస్సాంలోని గువాహటిలో గత సంవత్సరం డిసెంబర్ 27 నుంచి 31 వరకు నిర్వహించిన 14వ జాతీయ పాఠశాల చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన సాయి అంషిత పువ్వాల అద్భుత ప్రతిభ కనబర్చింది. అండర్ 9 బాలికల విభాగంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న క్రీడాకారిణులతో పోటీపడి ద్వితీయ స్థానం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.

చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో చెస్‌లో ఈ ఘనత సాధించడం విశేషమని క్రీడా వర్గాలు కొనియాడుతున్నాయి. సాయి అంషిత  క్రమశిక్షణతో కూడిన సాధన, వ్యూహాత్మక ఆలోచన, పట్టుదల ఈ విజయానికి కారణమని ఆమె శిక్షకులు తెలిపారు.ఈ విజయం ద్వారా ఆమె తన కుటుంబానికి, పాఠశాలకు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని పలువురు అభినందనలు తెలిపారు.