18-11-2025 04:27:27 PM
శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి
నకిరేకల్,(విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులు ,యువత కృషి చేయాలని శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాంటి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞా ఆయన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు యువత గంజాయి, డ్రగ్స్ బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ కలిగి ఉన్నా చట్టరీత్యా నేరామని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహనకలిగిఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నమ్మొద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు ఎస్సై మునుగోటి రవీందర్ ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.