18-11-2025 05:03:46 PM
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని
మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో దేశంలోనే విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును మాదకద్రవ్యాలు నాశనం చేస్తున్నాయని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే "నశా ముక్త భారత అభియాస్"ప్రధాన ఉద్దేశం గా మరిపెడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గుణంకాల ప్రకారం 25 ఏళ్లలోపు యువత అధికంగా బానిసలు అవుతుండటం అందులకు కలిగిస్తున్న అంశం.
మాదక ద్రవ్యాలు మానసిక, శారీరిక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని, ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనకబడేలా చేస్తాయన్నారు. ఒకసారి దీనికి బానిసైతే ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికి వెనకాడనన్నారు. ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని తగు సూచనలు తెలిపి ,మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల తహసిల్దార్ కృష్ణవేణి, మండల పరిషత్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దయానంద్, స్థానిక ఎస్సై వీరభద్రరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ గౌడ్, పోలీస్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.