18-11-2025 05:21:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనం కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మికులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో వంట కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. భోజనం కోసం అవసరమయ్యే వంట సామాగ్రి కొనుగోలు కోసం చేతిలో డబ్బు లేక అప్పులు చేసి వడ్డీ చెల్లిస్తున్నారని వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.