calender_icon.png 18 November, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు నష్టం జరగకుండా చూస్తాం

18-11-2025 05:19:16 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటల పిఏసిస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సోయా బ్యాగుల నాణ్యత విషయంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని మార్పిడి జిల్లా అధికారి మహేష్ రైతులకు హామీ ఇచ్చారు. ఇటీవలే కొనుగోలు చేసిన సోయపంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే గోదాముకు వెళ్ళిన తర్వాత అవి నాసిరకంగా ఉన్నాయని 365 కుంటల స్వయ బ్యాగులను తిప్పి పంపడంతో రైతులు తమ ఆవేదనను జిల్లా అధికారికి విన్నవించారు. రైతులు ఆందోళన చెందవద్దని నాణ్యమైన పంటను తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు భాస్కర్ దీక్షిత్ పటేల్ జుట్టు అశోక్ పడకండి దత్తు గజేందర్ దశరథ పోశెట్టి తదితరులు ఉన్నారు.