18-11-2025 04:52:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): శివారు కాలనీలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జాడుచలావు యాత్ర నిర్వహించి శివారు కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మురికి కాలువలు సిసి రోడ్లు లేవని ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ శ్రీనివాస్ సాదిక్ మాజీ సాజిద్ పాల్గొన్నారు.