calender_icon.png 20 September, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలి: ఎస్పీ రావుల గిరిధర్

20-09-2025 08:32:30 PM

వనపర్తి టౌన్: శాంతి భద్రతలను పరిరక్షణ ప్రతి ఒక్క పోలీసు ప్రధాన లక్ష్యంగా పట్టణంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని వనపర్తి జిల్లాఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ నెలవారి నేరసమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు తెలుసుకొని చాలా కాలము నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్స్,మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులు ఛేదించాలన్నారు.

ఈ సందర్భంగా  ఎస్పీ మాట్లాడుతూ... గణపతి నవరాత్రి ఉత్సవాల లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి సహకరించిన ప్రజలకు, కృషిచేసిన ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది అధికారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా రానున్న దుర్గా దేవి ఉత్సవాలలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంబించనున్నట్లు అందులో భాగంగానే, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపుమాపేల కృషి చేయాలని తెలిపారు.